టాలీవుడ్ అగ్రహీరో జూ.ఎన్టీఆర్.. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కొత్తవారితో తీస్తోన్న సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. తన ట్విట్టర్లో 'మత్తు వదలరా' తొలిరూపును పంచుకున్నాడు. ఈ చిత్రంతో సింహాకోడూరి హీరోగా పరిచయమవుతున్నాడు. వార్త పత్రికలపై ఈ నటుడు పడుకొని ఉన్న ఈ ఫొటో ఆసక్తి రేపుతోంది.
తారక్ ట్వీట్‌తో 'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్ - ఫస్ట్‌లుక్ ట్వీట్ చేసిన హీరో జూ.ఎన్టీఆర్
కొత్త నటులతో తీస్తోన్న 'మత్తు వదలరా' సినిమా తొలిరూపును.. జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
![తారక్ ట్వీట్‌తో 'మత్తు వదలరా' ఫస్ట్‌లుక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4841935-664-4841935-1571812625961.jpg)
మత్తు వదలరా ఫస్ట్‌లుక్
ఈ సినిమాతో కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారుతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి-హేమలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇది చదవండి: కుక్కలతో.. క్యాట్ వాక్ చేసిన ఫ్యాషన్ భామలు