కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తోన్న చిత్రం 'బెల్‌బాటమ్' చిత్రీకరణను తిరిగి ప్రారంభమించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది చిత్రబృందం. ఆగస్టులో షూటింగ్కోసం లండన్ వెళ్లనుంది. ఇందుకోసం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు అక్షయ్.
సెట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్యబృందాన్ని కూడా అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డులు, థర్మల్ స్కీనింగ్ సహా పలు జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు బాలీవుడ్ ఖిలాడీ.
"చాలా రోజుల తర్వాత మళ్లీ సెట్లో అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉంది. సెట్లో సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం సహా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అంతా సజావుగా సాగుతుందని భావిస్తున్నాను".
-అక్షయ్‌కుమార్, కథానాయకుడు.