కొత్త ఏడాదికి ఆనందంగా స్వాగతం పలికింది అందాల నాయిక కియారా అడ్వాణీ. మాల్దీవుల్లో హాయిగా సేదతిరుతూ కొత్త ఏడాదిలో ప్రారంభంలో అక్కడే సందడి చేసింది. ఆమె మాల్దీవులు విహార యాత్ర ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. విశ్రాంతి తర్వాత ఇప్పుడు తన శరీరానికి మెరుగులు అద్దుతోంది.
విహారంలో నచ్చింది తింటూ గడిపేసిన కియారా ఇప్పుడు కేలరీలను కరిగించే పనిలో పడింది. వర్కవుట్లు చేస్తూ కష్టపడుతోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది. 'ఛార్జ్‌డ్ ఫర్ 2021' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.