తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫైట్ మాస్టర్ మృతి.. ఐదుగురిపై కేసు - ఫైట్ మాస్టర్ వివేక్

ప్రముఖ ఫైట్ మాస్టర్ వివేక్​ మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. అనుమతులు లేకుండా షూటింగ్స్​లో ప్రమాదకర స్టంట్స్​ చేయొద్దని అన్నారు.

fight master death
ఫైట్ మాస్టర్ మృతి

By

Published : Aug 10, 2021, 8:13 PM IST

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ఫైట్ మాస్టర్ వివేక్(28) మృతి కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 'లవ్ యూ రచ్చు' చిత్ర షూటింగ్​లో భాగంగా సోమవారం జోగినదొడ్డి ప్రాంతంలో స్టంట్ చేస్తుండగా విద్యుదాఘాతంతో వివేక్ మృతి చెందాడు.

ఈ కేసులో సినిమా దర్శకుడు శంకర్, నిర్మాత గురు దేశ్​పాండే, నటుడు వినోద్ కుమార్​, సినిమా ఇన్​ఛార్జ్ ఫెర్నాండెజ్, క్రేన్ ఆపరేటర్ మాధవన్​లపై బిదాడి స్టేషన్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

త్వరలో ఆదేశాలు..

ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. అనుమతులు లేకుండా షూటింగ్​ల్లో ఇలాంటి స్టంట్స్ చేయొద్దని, చిత్రీకరణ సమయాల్లో ఎలాంటి నియమ, నిబంధనలు పాటించాలనే దానిపై రెండు, మూడు రోజుల్లో మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అనుమతులు లేకుండా ఎవరూ, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దని చెప్పారు.

2016లోనూ 'మాస్తి గుడి' సినిమా షూటింగ్​లో ఇద్దరు స్టంట్​మెన్ రిజర్వాయర్​లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి మరణించారు.

ఇదీ చదవండి:షూటింగ్​లో నటుడు ప్రకాశ్​రాజ్​కు​ గాయం

ABOUT THE AUTHOR

...view details