తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రధాని నరేంద్ర మోదీకి  కంగన​ తల్లి ధన్యవాదాలు - బీఎంసీ కంగనా

తన కుమార్తె కంగనాకు వై-ప్లస్​ కేటగిరీ భద్రత కల్పించడంపై హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు ఆశా రనౌత్.

Kangana's mom thanks PM Modi, Amit Shah for actor's Y-plus security
భాజపాకు ధన్యవాదాలు తెలిపిన కంగన రనౌత్​ తల్లి

By

Published : Sep 11, 2020, 8:40 AM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ తల్లి ఆశా రనౌత్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తన కుమార్తెకు వై-ప్లస్​ కేటగిరీ భద్రతను కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

"దేశ ప్రజలందరి ఆశీర్వాదాలు కంగనకు ఉన్నాయి. నా కుమార్తె ఎప్పుడూ సత్యం వైపు నిలబడటం నాకు గర్వించదగ్గ విషయం. కేంద్ర హోంమంత్రి అమిత్​షాకు కృతజ్ఞతలు చెబుతున్నాను. మేం కాంగ్రెస్​ పార్టీకి సంబంధించిన వాళ్లమైనా.. బీజేపీతో సంబంధం కలిగి ఉండకపోయినా వారు మాకు అండగా నిలిచారు. అమిత్​ షా మాకు మద్దతునిచ్చి.. నా కుమార్తెకు భద్రత కల్పించారు. మోదీ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను"

- ఆశా రనౌత్​, కంగనా రనౌత్​ తల్లి

ఏ దురుద్దేశం లేదు

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ తన కార్యాలయంలో చట్టవిరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ముంబయి మహానగర పురపాలక సంస్థ (బీఎంసీ) హైకోర్టుకు తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని వెల్లడించింది. బుధవారం కంగన కార్యాలయంలో కూల్చివేతలపై స్టే విధించడం సహా వాటిని ఎందుకు చేపట్టారో వివరణ ఇవ్వాలంటూ బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ గురువారం న్యాయస్థానంలో అఫిడవిట్​ దాఖలు చేసింది. మంజూరు చేసిన భవన ప్రణాళికకు భిన్నంగా కంగన కార్యాలయంలో పలు నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొంది. న్యాయస్థానం స్టే విధించిన వెంటనే కూల్చివేత పనులు ఆపేశామని తెలిపింది. అయితే ఆ కార్యాలయంలో యథాతథ స్థితికి కొనసాగించాలని, ఎలాంటి పనులు చేపట్టకుండా కంగనను ఆదేశించాలని కోర్టుకు విన్నవించింది.

బీఎంసీనే మళ్లీ పునరుద్ధరించాలి

బీఎంసీ చర్యలతో కంగనా కార్యాలయం దెబ్బతిందని ఆమె తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అక్కడ నీరు, విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగిందని, వాటిని మళ్లీ ఆ సంస్థే పునరుద్ధరించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

కంగనా కార్యాలయం విషయంలో బీఎంసీ వ్యవహరించిన తీరుపై మహారాష్ట్ర గవర్నర్​ బీఎస్​ కొష్యారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గురువారం.. కేంద్ర మంత్రి, ఆర్​పీ(ఏ) పార్టీ అధినేత రామ్​దాస్​ అథవాలే కంగనను ఆమె నివాసంలో కలిశారు. తమ పార్టీ ఆమెకు మద్దతుగా ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details