తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎఫ్​ఐఆర్ కొట్టేయాలని హైకోర్టుకు కంగనా రనౌత్

దేశద్రోహం కేసులో తనకు ఊరట కల్పించాలని కోరిన కంగనా రనౌత్.. తనపై ఉన్న ఎఫ్​ఐఆర్​ను కొట్టేయాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా పోలీసులు నోటీసులు పంపిస్తున్నా సరే ఈమె వారి ముందు హాజరు కావడం లేదు.

By

Published : Nov 23, 2020, 4:50 PM IST

Kangana moves HC to quash Mumbai Police's FIR against her
ఎఫ్​ఐఆర్ కొట్టేయాలని హైకోర్టుకు కంగనా రనౌత్

తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ను కొట్టేయాలని ప్రముఖ నటి కంగనా రనౌత్.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ వెల్లడించారు. దర్యాప్తు కోసం పోలీసుల ముందు హాజరుకావాలని కోరుతూ జారీ చేసిన సమన్లకు ​​స్టే ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరిందని అన్నారు. వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశించామని ఆయన చెప్పారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగన, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోందని నమోదైన ఫిర్యాదు మేరకు ఆమెతో పాటు సోదరి రంగోలిపైనా దేశద్రోహం కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని కంగన, రంగోలికి ఇప్పటికే మూడుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ అక్కడికి వెళ్లకుండా, తమపై ఉన్న ఎఫ్​ఐఆర్ రద్దు చేయాలని కంగన, హైకోర్టును ఆశ్రయించింది.

ABOUT THE AUTHOR

...view details