తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్యాక్​గ్రౌండ్​​తో ఆకట్టుకుంటున్న 'కల్కి' టీజర్! - movie

హీరో రాజశేఖర్ కొత్త చిత్రం 'కల్కి' టీజర్ విడుదలైంది. ఆకట్టుకునే విజువల్స్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో ఆసక్తికరంగా ఉంది. సంభాషణలు లేకుండా కేవలం సంగీతంతోనే టీజర్​ను మలిచింది చిత్రబృందం.

కల్కి

By

Published : Apr 10, 2019, 11:38 AM IST

రాజశేఖర్ కొత్త చిత్రం 'కల్కి' టీజర్ విడుదలైంది. సస్పెన్స్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఆదా శర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంభాషణలు లేకుండా కేవలం బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తోనే టీజర్ చూపించారు. ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజువల్స్​​తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది చిత్రబృందం. హీరో రాజశేఖర్ మాస్​ లుక్​లో కనిపిస్తూ.. మెప్పిస్తున్నారు. 'పీఎస్​వీ గరుడవేగ' తరహాలో మరో విభిన్న కథను ఎంచుకున్నాడు రాజశేఖర్

ABOUT THE AUTHOR

...view details