తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 6:45 PM IST

ETV Bharat / sitara

Kajal agarwal: కాజల్ కొత్త సినిమా.. పెళ్లి తర్వాత స్పీడ్​గా!

ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా కొత్త ప్రాజెక్టులను ఒప్పుకొంటోంది.

Kajal Aggarwal
కాజల్

పెళ్లి తర్వాత కూడా ఎక్కడా తగ్గకుండా తన జోరు చూపిస్తోంది కాజల్ అగర్వాల్. సినిమా, వెబ్ సిరీస్​లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'ఉమ' టైటిల్​తో తెరకెక్కబోయే హిందీ సినిమాకు అంగీకారం తెలిపింది. ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది.

కాజల్ అగర్వాల్

'ఉమ' సినిమాతో తతగట సింఘా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నారు. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. కొవిడ్ పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్​ మొదలుపెట్టి ఒకే షెడ్యూల్​లో దానిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం కాజల్ తెలుగులో 'ఆచార్య', తమిళంలో 'భారతీయుడు 2', నాగార్జున కొత్త సినిమాలో హీరోయిన్​గా చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details