తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సీరియల్​ కిల్లర్​ భార్యగా శ్రీలంక భామ - webseries

బాలీవుడ్ నటి జాక్వలిన్​ ఫెర్నాండేజ్ వెబ్​సిరీస్​లో కనిపించనుంది. నెట్​ఫ్లిక్స్​ రూపొందిస్తున్న 'మిసెస్​ సీరియల్​ కిల్లర్'లో నటించనుంది. ఫరాఖాన్ నిర్మిస్తున్న ఈ సిరీస్​కు శిరీష్ కుందేర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

జాక్వలిన్

By

Published : Apr 24, 2019, 5:25 PM IST

సైఫ్​ అలీఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి బాలీవుడ్ నటులు ఇప్పటికే వెబ్​సిరీస్​లో నటించి డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లో సత్తాచాటారు. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ చేరింది. నెట్​ఫ్లిక్స్ రూపొందిస్తున్న 'మిసెస్ సీరియల్ కిల్లర్'​లో నటించనుంది. శిరీష్ కుందేర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్​ను ఫరాఖాన్ నిర్మిస్తుంది.

"సీరియల్ హత్యల ఆరోపణలతో జైలుపాలౌతాడు భర్త. అతడిని కాపాడుకోడానికి భార్య ఏం చేసింది" అనేది ప్రధాన కథాంశం. ఈ వెబ్​సిరీస్​ ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెట్​ఫ్లిక్స్​లో ఈ సిరీస్​ ప్రసారం కానుంది.

గత వారం రోజుల్లో ఈ వెబ్​సిరీస్​తో కలిపి పది చిత్రాలను ప్రకటించింది నెట్​ఫ్లిక్స్​. 2020 చివరి నాటికి మొత్తం 15 వెబ్​సిరీస్​లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో 'మ్యూజిక్ టీచర్', 'కోబాల్ట్ బ్లూ', 'చాప్​స్టిక్స్'​, 'బుల్​బుల్'​ లాంటి చిత్రాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details