తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 1:53 PM IST

Updated : Jun 9, 2020, 2:04 PM IST

ETV Bharat / sitara

నెట్​ఫ్లిక్స్​లో విడుదలకానున్న 'గుంజన్ సక్సేనా'

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ నటించిన 'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్'​ సినిమా త్వరలో ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​లో నేరుగా విడుదల కానుంది. ఇందులో టైటిల్​ రోల్​ పోషించిందీ ముద్దుగుమ్మ.

netflix
నెట్​ఫ్లిక్స్​

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మూసుకుపోవడం వల్ల అనేక సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో కొంతమంది తమ సినిమాలను ఓటీటీ ప్లాట్​ఫామ్​ ద్వారా విడుదల చేసేందుకు పూనుకున్నారు. పలు సినిమాలు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ బాటలోకి 'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్​' సినిమా చేరింది. త్వరలోనే ఈ చిత్రాన్ని నేరుగా నెట్​ఫ్లిక్స్​​లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది చిత్రబృందం.

1999 కార్గిల్​ యుద్ధంలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, యుద్ధ ప్రాంతంలోకి వెళ్లిన మొదటి భారతమహిళా వాయుసేన అధికారిగా చరిత్ర సృష్టించారు గుంజన్​ సక్సేనా. ఆమె జీవితం ఆధారంగా రూపొందిందీ చిత్రం.

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ టైటిల్​ రోల్​ పోషించింది. పంకజ్ త్రిపాఠి, వినీత్ సింగ్, అంగద్ బేడి, మానవ్ విజ్ ఇతర పాత్రల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్

ఇది చూడండి : వెంటిలేటర్​పై 'కరణం మల్లీశ్వరి' దర్శకురాలు!

Last Updated : Jun 9, 2020, 2:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details