తెలంగాణ

telangana

ETV Bharat / sitara

16 ఏళ్ల తర్వాత ఆ హీరోతో బోయపాటి?

హీరో రవితేజతో దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి సినిమా చేయనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'భద్ర' ఘన విజయాన్ని అందుకుంది.

raviteja
బోయపాటి

By

Published : May 23, 2021, 2:47 PM IST

దర్శకుడు బోయపాటి ప్రస్తుతం హీరో బాలకృష్ణతో 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్​ విడుదలై ప్రేక్షాదరణ పొందింది. ఈ క్రమంలోనే ఆయన తర్వాతి సినిమా ఎవరితో తీస్తారనే విషయం ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈసారి హీరో రవితేజతో చేయాలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని, ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించనుందనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ విషయమై స్పష్టత రానుంది.

గతంలో బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన పవర్​ఫుల్​ యాక్షన్​ చిత్రం 'భద్ర' ఘన విజయం సాధించింది. కాబట్టి ఈ కొత్త చిత్రం తెరకెక్కడం పక్కా అయితే దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం రవితేజ.. 'ఖిలాడి'లో నటిస్తుండగా త్రినాథరావు నక్కిన, శరత్​ మండవ దర్శకత్వంలో మరో రెండు చిత్రాలు చేయనున్నారు.

ఇదీ చూడండి: కరోనా కారణంగా రవితేజ చిత్రాలకు బ్రేక్

ABOUT THE AUTHOR

...view details