పలానా హీరోయిన్ పెళ్లి అంటే చాలు.. ఎవరు అతడు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సినిమా నటుడా లేదంటే ఏ రంగానికి చెందినవాడు? అని అభిమానులు తెగ గుసగుసలాడుకుంటారు. అదే ఆ వ్యక్తి వేరే దేశానికి చెందిన వాడు అయితే ఆ టాపిక్కు అంతే లేకుండా పోతుంది. అలా దేశాంతర వివాహాలు చేసుకున్న హీరోయిన్లు ఎవరు? వారు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు?. లాంటి వివరాలు మీకోసం.
ప్రియాంక చోప్రా-నిక్ జోనస్
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. తనకంటే దాదాపు పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడింది. 2018 డిసెంబరులో జోద్‌పుర్‌లో వీరి వివాహం ఎంతో వేడుకగా జరిగింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
ప్రీతి జింతా-జీన్
తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ జీన్ గుడ్ ఇనఫ్ను 2016లో లాస్ ఏంజెలిస్‌లో వివాహం చేసుకుంది ప్రముఖ నటి ప్రీతి జింతా. తమ ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ, భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది.