తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హైదరాబాద్​ కుర్రాడి షార్ట్​ ఫిల్మ్​.. ఆస్కార్​ ఎంట్రీలో - మనసానమః షార్ట్​ ఫిల్మ్​

2022 ఆస్కార్​ అవార్డుల ఎంట్రీ లిస్టులో చోటు సంపాదించుకుంది 'మనసానమః' షార్ట్​ ఫిల్మ్​. ఇప్పటికే అత్యధిక పురస్కారాలు అందుకున్న లఘుచిత్రంగానూ గిన్నిస్​ బుక్​ రికార్డుకెక్కింది.

manasa
మనసానమః

By

Published : Sep 23, 2021, 4:52 PM IST

'మనసానమః' షార్ట్​ ఫిల్మ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు పురస్కారాలను దక్కించుకున్న ఈ లఘు చిత్రం మరో ఘనతను అందుకుంది. కాలిఫోర్నియాలో జరగబోయే 2022 ఆస్కార్​ అవార్డుల ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకుంది. హైదారాబాద్​కు చెందిన దీపక్​ రెడ్డి దీనిని తెరకెక్కించారు.

ఈ షార్ట్​ ఫిల్మ్​ అత్యధిక అవార్డులు గెలుచుకున్న లఘుచిత్రంగానూ గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించుకుంది. ఎంతో మంది ప్రేక్షకులు నుంచి దర్శకుడు గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​, రష్మిక మంధాన, అనుష్క శెట్టి లాంటి స్టార్స్​ వరకు ఈ ఫిల్మ్​ను ప్రశంసించారు.

అంతకుముందు వరల్డ్​ ఫెస్ట్ హౌస్టన్​, కెటాలినా, గార్డెన్​ స్టేట్​, బాఫ్టా, క్రిస్టర్​ ప్యాలెస్​​, ఆక్స్​ఫర్డ్​ సహా పలు ఫిల్మ్​ ఫెస్టివల్​ అవార్డులు ఈ లఘుచిత్రానికి దక్కాయి.

ఇదీ చూడండి:ఆస్కార్ వేడుకలో భారత్​ వెలుగులు!

ABOUT THE AUTHOR

...view details