'ఎంత మంచివాడవురా..!' చిత్రంతో తొలిసారి సంక్రాంతి బరిలోకి నిలిచాడు హీరో నందమూరి కల్యాణ్ రామ్. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. మెహరీన్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిసారి పూర్తిస్థాయి కుటుంబకథలో నటించడం పట్ల కల్యాణ్‌రామ్ సంతోషంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరదాగా విలేకర్లతో ముచ్చటించాడు. ఆ విశేషాలివే
కథ అలా
'118' సినిమా తర్వాత నేను చాలా కథలు విన్నా. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనుకున్నాను. ఒకరోజు కృష్ణప్రసాద్ వచ్చి నాకు ఓ గుజరాతీ ఫిల్మ్ చూపించాడు. నాకు అందులోని మెయిన్ పాయింట్ నచ్చింది కానీ, మిగిలిన సన్నివేశాలు అంత నచ్చలేదు. దానిని ఆధారంగా చేసుకుని సతీశ్ ఒక కథ రాశారు ఒకసారి విను అని కృష్ణప్రసాద్ చెప్పారు. అలా సతీశ్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ తర్వాత అందులో చాలా మార్పులు చేశాడీ డైరెక్టర్. ఆగస్టులో షూటింగ్‌కు వెళ్లాం.
సాంగ్ నుంచి టైటిల్
సతీశ్ వేగేశ్న సినిమా టైటిళ్లలో తెలుగుదనం ఉంటుంది. 'శతమానంభవతి', 'శ్రీనివాసకల్యాణం' టైటిళ్లు నాకు బాగా నచ్చాయి. ఈ కథ చెప్పినప్పుడు సతీశ్ మొదట 'ఆల్ ఈజ్ వెల్' అనే టైటిల్ పెట్టారు. కానీ నేను మాత్రం తెలుగు టైటిల్ కావాలని అడిగాను. అలా చివరికి ఆయన 'ఎంత మంచివాడవురా..!' టైటిల్ పెట్టారు. 'నమ్మినబంటు' సినిమాలోని ఓ పాట నుంచి ఈ పేరొచ్చింది. దానినే మేం మా సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌లో చూపించాం.
నిజ జీవితంలో ఎలా ఉంటానో అదే
నేను వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర అలాగే ఉంటుంది. చాలా సింపుల్, సరదాగా ఉంటుంది. షూటింగ్‌కు వెళ్లే ముందు డైరెక్టర్ ఒకటే చెప్పారు. 'సర్ మీరు ఈ సినిమా మొత్తం సంతోషంగా, నవ్వుతూ ఉండండి' చాలు అని. ఎమోషనల్, కమర్షియల్ హంగులు ఉన్న సినిమా ఇది.
అప్పుడే అయిపోయిందా
ఆగస్టులో స్టార్ట్ అయిన మా సినిమా షూటింగ్ 70 రోజుల్లోనే అయిపోయింది. ప్రతిరోజూ చాలా సరదాగా గడిచేది. మేము షూట్ చేసిన ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లకు సిగ్నల్స్ ఉండేవి కాదు. అందువల్ల సెట్‌లో అందరం ఫోన్లు పక్కనపెట్టేసి చక్కగా మాట్లాడుకునేవాళ్లం. మళ్లీ హోటల్‌కు వెళ్లాక ఫోన్లు చూసుకునేవాళ్లం. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు అప్పుడే అయిపోయిందా అనిపించింది. డైరెక్టర్‌ను ఇంకా కొన్ని సన్నివేశాలు పెట్టమని కోరాను. (నవ్వుతూ)
కొన్ని సన్నివేశాలు హత్తుకున్నాయి