హీరో కల్యాణ్‌రామ్.. తమ కుటుంబ మల్టీస్టారర్ గురించి మాట్లాడాడు. బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు తారక్‌తో కలిసి నటించే విషయంపై స్పందించాడు. సోమవారం ఈటీవీలో ప్రసారం కానున్న 'ఆలీతో సరదాగా' టాక్‌షోలో ఈ విషయం చెప్పనున్నాడు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోగ్రాం ప్రోమోలో ఇందుకు సంబంధించిన ఓ సరదా సంభాషణను పంచుకున్నారు.
వారిద్దరితో కలిసి తనకు నటించే అవకాశమొస్తే, అందులోని ఐటమ్ సాంగ్‌లో ఇలా వచ్చి అలా వెళ్లే పాత్ర చేస్తానని అన్నాడు కల్యాణ్‌రామ్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలో నిజం కాబోతుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ కథానాయకుడు 'ఎంత మంచివాడవురా!'లో నటించాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
కల్యాణ్‌రామ్ వెంటపడి ఐలవ్యూ అడిగిందెవరు..?