టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇప్పటివరకూ కనిపించని లుక్‌లో బాలయ్య దర్శనమిస్తుండటం వల్ల అందరిలోనూ ఆసక్తి పెరిగింది. గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చిరు నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఇటీవలే తెదేపా శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన సమయంలో ఈ ఫొటో తీసుకున్నట్లు తెలుస్తోంది.
నయా లుక్‌లో బాలకృష్ణ.. ఎందుకోసం? - TDP BALAKRISHNA
హీరో బాలకృష్ణ.. కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హీరో బాలకృష్ణ
అయితే నెటిజన్లు, అభిమానులు మాత్రం.. బాలకృష్ణ కొత్త సినిమా కోసమే ఇలా తయారయ్యారని అంటున్నారు. మరి వారు అనుకుంటున్నట్లు చిత్రం కోసమా? లేక మరింకేదైనా కారణం ఉందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.