భారతీయ చిత్రసీమలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్స్ బయోపిక్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హరియాణాకు చెందిన హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ హవా సింగ్ జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తెరపై అతడి పాత్రను సూరజ్ పంచోలి పోషించనున్నాడు. ప్రకాష్ నంబియార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ కథానాయకుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశాడు.