చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించిన నాయిక జెనీలియా. హా..హా.. హాసిని అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే వివాహం అనంతరం ఈ భామ నటనకు దూరంగా ఉంది. రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
పెళ్లి తర్వాత హాసిని రీఎంట్రీ.. ఇద్దరు హీరోలతో! - genelia d'souza latest new
హాసిని మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందట. అదేనండి జెనీలియా మరోసారి ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమవుతోందట. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్తో పాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో నటించనుందని సమాచారం.
జెనీలియా
చిరంజీవి కథానాయకుడిగా 'లూసిఫర్' రీమేక్ తెరకెక్కనుంది. సుజిత్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా ప్రకటించారు. ఈ కథను మలుపు తిప్పే కీలకపాత్ర కోసం కూడా జెనీలియాను ఎంపిక చేసే అవకాశాలున్నాయని టాక్. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.