ఈ ఏడాదికిగాను ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో(దక్షిణాది) 'రంగస్థలం' సత్తాచాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటి, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. వీటితో పాటు మరికొన్ని అవార్డుల వివరాలు ఇవే.
- ఉత్తమ నటుడు - రామ్చరణ్ (రంగస్థలం)
- ఉత్తమ నటి-కీర్తి సురేశ్(మహానటి)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మన్ (మహానటి)
- ఉత్తమ నటి (క్రిటిక్స్)- రష్మిక మంధాన (గీతగోవిందం)
- ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (మహానటి)
- ఉత్తమ నేపథ్య గాయకుడు- సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం కావాలే, గీతగోవిందం)
- ఉత్తమ నేపథ్య గాయని-శ్రేయ ఘోషల్(మందార మందార-భాగమతి)
- ఉత్తమ సహాయనటుడు -జగపతి బాబు (అరవింద సమేత)
- ఉత్తమ సహాయనటి - అనసూయ (రంగస్థలం)
- ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీప్రసాద్ (రంగస్థలం)
- ఉత్తమ పాటల రచయిత - చంద్రబోస్ (ఎంత సక్కగున్నవే-రంగస్థలం)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - రత్నవేలు (రంగస్థలం)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ - జానీ, ప్రభుదేవా ( రౌడీ బేబీ)