తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కథ విన్నాక నోట మాట రాలేదు..' - entha manchivadavura

నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది.

entha
కల్యాణ్

By

Published : Dec 22, 2019, 5:41 AM IST

నందమూరి కల్యాణ్‌రామ్, మెహరీన్‌ నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది.

ఈ చిత్రం ఇంత బాగా వచ్చిందంటే కారణం నిర్మాతలే. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకూడదు. హార్థిక సంబంధాలుగా ఉండాలనే సందేశాన్ని ఈ చిత్రంతో చెప్పబోతున్నాం. ఇటీవల విడుదల చేసిన తొలి టైటిల్‌ గీతంలోనూ ఇదే విషయం చెప్పాం. బాధ పంచుకోవడానికి ఓ మనిషి ఉండాలి, ప్రతి మనిషీ పదిమందికి సహాయ పడాలి అని ఆలోచన చేసే వ్యక్తిగా కల్యాణ్‌ పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు తగ్గట్లుగానే టైటిల్‌ను ఎంచుకున్నాం. ఓ గుజరాతీ చిత్ర స్ఫూర్తితో ఈ కథను సిద్ధం చేసుకున్నా. అలాగని ఇది పూర్తి రీమేక్‌ కాదు. కేవలం మాతృకలోని కీ లైన్‌ను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌ను రాసుకున్నాం. కల్యాణ్‌ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన గత చిత్రాల కన్నా భిన్నంగా ఇందులో కనిపిస్తాడు. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర మెహరీన్‌ది. ఎంతో గ్లామర్‌గానూ ఉంటుంది. ఈ సంక్రాంతికి మంచి కుటుంబ కథా చిత్రంగా మిగిలిపోతుంది."
-సతీష్ వేగేశ్న, దర్శకుడు

’"మనసుకు నచ్చి చేసిన చిత్రమిది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. జనవరి తొలి వారంలో ముందస్తు వేడుక నిర్వహిస్తాం. అక్కడ మరిన్ని విశేషాలు పంచుకుంటా."
-కల్యాణ్ రామ్, హీరో

"సతీష్‌ చెప్పిన కథ విన్నాక నాకు నోట మాట రాలేదు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 'ఎఫ్‌2' హనీ పాత్ర నాకెంత ఆత్మస్థైర్యాన్నిచ్చిందో.. మళ్లీ అలాంటి పాత్రను ఇందులో పోషించా. నాకింత చక్కటి అవకాశమిచ్చినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు."
-మెహరీన్‌, హీరోయిన్

ఇవీ చూడండి..పూరి-దేవరకొండ సినిమాలో మైక్ టైసన్..!

ABOUT THE AUTHOR

...view details