తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేమిద్దరం కలిస్తే ఆ విషయాలే మాట్లాడుతాం: నభా నటేశ్ - disco raja

మాస్​ మహారాజా రవితేజతో 'డిస్కోరాజా'లో నటించిన నభా నటేశ్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో చిత్రవిశేషాలను పంచుకుంది. ఈనెల 24 నుంచి థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా.

nabha
చాలా సంతోషంగా ఉన్నా: నభా నటేశ్

By

Published : Jan 19, 2020, 5:26 PM IST

కెరీర్‌ ఆరంభంలోనే విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాన్నంటోంది హీరోయిన్ నభా నటేశ్‌. 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగుతెరకు పరిచమైన ఈ భామ.. గతేడాది 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె.. రవితేజతో 'డిస్కోరాజా'లో నటించింది. ఈ 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించింది నభా. ఆ విశేషాలివే

'ఇస్మార్ట్‌ కిక్‌'

2019.. నాకు చాలా అద్భుతంగా ఉంది. కెరీర్‌ పరంగా అది నాకు బెస్ట్‌ ఇయర్‌ అనే చెప్పాలి. గతేడాది విడుదలైన 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నా. ఇప్పటికీ ఆ కిక్‌ నుంచి బయటకు రాలేకపోతున్నా. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా 'ఇస్మార్ట్‌ శంకర్‌'లోని డైలాగ్స్‌, డ్యాన్స్‌ చేయమని అడుగుతున్నారు.

నభా నటేశ్

రవితేజతో ఉంటే

రవితేజకు నేను పెద్ద అభిమానిని. ఆయన నటన, ఎనర్జీ, కామెడీ టైమింగ్‌ వేరే లెవల్‌లో ఉంటాయి. ఆయన నటించిన చిత్రాల్లో 'విక్రమార్కుడు' నా ఫేవరెట్‌ మూవీ. అలాగే 'కిక్‌' సినిమా కూడా ఇష్టమే. అభిమానించే వ్యక్తితో నటించే అవకాశం వస్తే ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఆయన ఎప్పుడూ పాజిటివ్​గా ఉంటారు. మేమిద్దరం కలిస్తే ఫుడ్‌, లైఫ్‌, ఆయన తోటలో పండే పండ్ల గురించి మాట్లాడుకుంటుంటాం.

పాయల్‌తో నో సీన్స్‌

ఇందులో నేనొక బ్యాంక్‌ ఉద్యోగినిగా కనిపిస్తాను. వాహనాలకు ఇచ్చిన లోన్స్‌ను కలెక్ట్‌ చేస్తూంటాను. నేను పోషించిన పాత్ర నా రియల్‌ లైఫ్‌కు దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ రోల్​లో ఎమోషన్స్‌కు ఎక్కువ విలువనిస్తుంది. ప్రస్తుత కాలంలో స్వతంత్ర భావాలు కలిగిన ఓ అమ్మాయి ఎలా ఉంటుందో ఇందులో నా క్యారెక్టర్‌ అలా ఉంటుంది. పాయల్‌కు నాకు మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండవు. నేను చేసిన సన్నివేశాలన్నీ రవితేజ, సత్యం రాజేశ్‌, నరేశ్‌తోనే ఉంటాయి.

నభా నటేశ్

చాలా సంతోషంగా ఉన్నా

ఒక నటిగా నేను అన్ని రకాల పాత్రల్లో నటించాలనుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకూ తెలుగులో నటించిన మూడు సినిమాల్లో మూడు విభిన్న పాత్రలు పోషించాను. 'డిస్కోరాజా'లో నేను పోషించిన పాత్ర ప్రతిఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి మంచి పాత్రల్లో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది.

24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నానంటూ.. నభా నటేశ్

‘డిస్కోరాజా’ గురించి చెప్పలేదు

'డిస్కోరాజా' ఒక మాస్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. వి.ఐ.ఆనంద్‌ చాలా వినూత్నంగా తీశారు. దర్శకుడు మొదట నాకు ఈ సినిమా కథతో పాటు రవితేజ హీరో అని చెప్పారు. 'డిస్కోరాజా' టైటిల్‌ గురించి చెప్పలేదు. ఈ కథ వినగానే నాకెంతో నచ్చేసింది. దీనిపై నాకు బాగా నమ్మకముంది. మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నా. ప్రేక్షకులతోపాటు నేను జనవరి 24 కోసం ఎదురుచూస్తున్నాను.

డిస్కోరాజా ప్రచార చిత్రం

ఇంకా స్నేహితులు కాలేదు

ఇండస్ట్రీలో నాకు హీరోయిన్స్‌ ఎవరూ ఇంకా స్నేహితులు కాలేదు. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటాను. షూటింగ్‌ ఉన్నప్పుడు వచ్చి, పూర్తవగానే వెళ్లిపోతాను. త్వరగా వేరేవాళ్లతో కలవడానికి ఇష్టపడను. విమాన ప్రయాణంలో ఎవరైనా కలిస్తే మాట్లాడతాను.

డిస్కోరాజాలో రవితేజ

వాళ్లకంటే బాగా చేయాలి

సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌ మధ్య పోటీ సహజమే. నేను వేరే హీరోయిన్స్‌ సినిమాలు చూసి చాలా విషయాలు నేర్చుకుంటాను. అలాగే వాళ్లకంటే బాగా నటించాలని అనుకుంటాను.

24న విడుదల కానున్న డిస్కో రాజా

తమిళం, కన్నడంలోనూ

'డిస్కోరాజా' తర్వాత తెలుగులో సాయితేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటరు' చిత్రంలో నటిస్తున్నా. ఇందులోనూ నా పాత్ర చాలా వినూత్నంగా ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్​తో చేస్తున్నాను. వీటితోపాటు కన్నడ, తమిళంలోనూ కథలు వింటున్నాను.

ఇదీ చూడండి: 'రాయల్​ లుక్'​లో అదరగొట్టిన ఇస్మార్ట్​ శంకర్​

ABOUT THE AUTHOR

...view details