తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిలకడగా నటుడు దిలీప్​కుమార్​​​ ఆరోగ్యం

అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ దిగ్గజం దిలీప్​కుమార్(Dilip Kumar)​ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే ఆయన వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. దిలీప్​ ఆరోగ్యంపై అసత్య వార్తలను ప్రచారం చేయోద్దని వారు కోరారు.

By

Published : Jun 7, 2021, 2:21 PM IST

Dilip Kumar on oxygen support, stable
నిలకడగా నటుడు దిలీప్​కుమార్​​​ ఆరోగ్యం

ఊపిరితిత్తుల సమస్యలతో ఆస్పత్రి(Dilip Kumar hospitalized)లో చేరిన బాలీవుడ్​ దిగ్గజం దిలీప్​ కుమార్​ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దిలీప్​ కుమార్​ ముంబయిలోని హిందూజా హాస్పిటల్​ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు(oxygen support) దిలీప్‌కుమార్‌ ట్విట్టర్‌వేదికగా వెల్లడించారు.

దిలీప్‌ ఆరోగ్యంపై ఆయన అధికారిక ట్విట్టర్‌ఖాతాలో నిర్ధారించిన సమాచారాన్ని మాత్రమే అందించాలని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన వెంటిలేటర్‌పై లేరని హిందూజా వైద్యులు తెలిపారు. దిలీప్‌కుమార్‌(Dilip Kumar)​ ఆరోగ్య పరీక్షలకు సంబంధించి కొన్ని నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. 98 ఏళ్ల దిలీప్‌కుమార్‌కు ఊపిరితిత్తల సమస్య తలెత్తడం వల్ల ఈ నెల 5న హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చూడండి:ఆస్పత్రిలో చేరిన దిలీప్​ కుమార్​

ABOUT THE AUTHOR

...view details