లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సతీమణి నటి సైరా భాను తెలిపారు. ఆ పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ దిలీప్ డిశ్చార్జ్ అవుతారని ఆమె వెల్లడించారు. దిలీప్ క్షేమంగా ఉండాలని ప్రతిఒక్కరూ ప్రార్థన చేయాలని అభిమానులకు కోరారు.
ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటుడు
ఇటీవలే ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్.. ఆదివారం మరోసారి ఆస్పత్రిలో చేరారు. అయితే సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆయన ఆస్పత్రికి వచ్చారని ఆయన సతీమణి సైరా భాను స్పష్టం చేశారు. పరీక్షలు పూర్తైన అనంతరం దిలీప్ డిశ్చార్జ్ అవుతారని ఆమె తెలిపారు.
ఆస్పత్రిలో చేరిన నటుడు దిలీప్ కుమార్
గతేడాది దిలీప్ సోదరలైన అస్లాం ఖాన్(88), ఇహాన్ ఖాన్(90) కరోనా బారిన పడి మరణించారు. దిలీప్ కుమార్.. 1944లో విడుదలైన 'జ్వర్ భాతా' బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. చివరిసారిగా 'కిలా' చిత్రంలో దిలీప్ నటించారు.