తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయశాంతిపై చిరు ప్రేమ.. అది వేరు ఇది వేరన్న రాములమ్మ - sitara

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర మెగా సూపర్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి విజయశాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ సందడి చేశారు. పాత జ్ఞాపకాలు, రాజకీయ పరిణామాలను గుర్తు తెచ్చుకుని నవ్వులు పూయించారు.

chiranjeevi, vijayashanthi meet in 'sarileru neekevvaru' movie event
విజయశాంతిపై చిరు ప్రేమ.. అది వేరు ఇది వేరన్న రాములమ్మ

By

Published : Jan 6, 2020, 12:41 AM IST

Updated : Jan 6, 2020, 1:02 AM IST

సూపర్ స్టార్ మహేష్​ బాబు హీరోగా అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ద్వారా 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఈవెంట్​ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

రాజకీయాల్లోకి వెళ్లాక తనను ఎందుకు మాటలన్నావని విజయశాంతిని చిరంజీవి సరదాగా అడిగారు. అందుకు బదులిచ్చిన విజయశాంతి.. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. అయినా మీరు ఎప్పటికీ మా హీరోనే. మళ్లీ సినిమా చేద్దాం. అందుకు మీరు సిద్ధమా అంటూ చిరంజీవిని సరదాగా ప్రశ్నించారు.

"రాజకీయం శత్రువులను పెంచితే, సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుంది. మహేశ్​ వల్లే నేను, నా ఫ్రెండ్(విజయశాంతి) మళ్లీ కలిశాం" -మెగాస్టార్ చిరంజీవి

దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసిన విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడాడు.

ఇవీ చూడండి: మహేశ్​ను చూడగానే కత్తిలా అనిపించాడు: చిరంజీవి

Last Updated : Jan 6, 2020, 1:02 AM IST

ABOUT THE AUTHOR

...view details