ETV Bharat / sitara

మహేశ్​ను చూడగానే కత్తిలా అనిపించాడు: చిరంజీవి - vijaya shanthi-mahesh babu-chiranjeevi

'సరిలేరు నీకెవ్వరు' మెగా సూపర్​ ఈవెంట్​(ప్రీరిలీజ్​)​లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి... హీరో మహేశ్​బాబును ప్రశంసలతో ముంచెత్తాడు. సూపర్​స్టార్ కృష్ణ గురించి, విజయశాంతి తదితరుల గురించి తన స్పీచ్​లో ప్రస్తావించాడు.

విజయశాంతి-మహేశ్​బాబు-చిరంజీవి
మహేశ్​ను చూడగానే కత్తిలా అనిపించాడు: చిరంజీవి
author img

By

Published : Jan 5, 2020, 11:05 PM IST

Updated : Jan 6, 2020, 11:33 AM IST

"ఓ రోజు పేపర్​లో మహేశ్​.. ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో చూడగానే కత్తిలా అనిపించాడు" అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. హైదరాబాద్​ వేదికగా ఆదివారం జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' మెగా సూపర్ ఈవెంట్​లో ఈ వ్యాఖ్యలు చేశాడు. వీటితో పలు విషయాలను పంచుకున్నాడు.

Chiranjeevi at Sarileru Neekevvaru Mega Super Event
సూపర్​ మెగా ఈవెంట్​లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందంతో మెగాస్టార్ చిరంజీవి

"మహేశ్​బాబును చూస్తే, నా బిడ్డలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అతడి చిరునవ్వు వెనక చిలిపితనం ఉంటుంది. దొంగ...! చాలా రోజుల క్రితం పేపర్​లో 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్​లుక్ చుశా. అప్పుడు మహేశ్​ ఫొటో చూడగానే కత్తిలా ఉన్నాడనిపించింది. ఈ కత్తికి రెండు వైపులా పదును ఉందా అనిపించింది. అందులో చాలా స్మార్ట్​గా ఉన్నాడు. వెంటనే సినిమా చూడాలన్న ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అంటే ఈ మధ్యనే, నాకు ఫోన్ చేసిన ప్రీరిలీజ్​ ఈవెంట్​కు రావాలన్నారు. నేను షాక్ తిన్నా. ఇంత త్వరగా ఎలా పూర్తి చేశారబ్బా? అని అనిపించింది. ఇలాంటి మార్పే టాలీవుడ్​లో రావాలి. యుద్ధ ప్రాతిపదికన తీస్తే ఇంతకంటే కావాల్సింది ఏముంది. నేను ఈ విషయం గురించి, నాతో తర్వాత సినిమా తీస్తున్న కొరటాలతో మాట్లాడాను. 80-99 రోజుల్లో తీస్తానని, 100వ రోజు తీసుకోనని అన్నాడు." -మెగాస్టార్ చిరంజీవి

అదే విధంగా సూపర్​స్టార్ కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాలని చిరంజీవి అన్నాడు.

"రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.. సూపర్​స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా కృషి చేయాలి. ఆయన ఈ అవార్డుకు అన్ని విధాల అర్హుడు." -మెగాస్టార్ చిరంజీవి

దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేసిన విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడాడు.

vijaya shanthi-mahesh babu-chiranjeevi
విజయశాంతి-మహేశ్​బాబు-చిరంజీవి

"రాజకీయాలు శత్రువుల్ని పెంచుతుందని, సినిమా రంగం మిత్రుల్ని ఎక్కువ మందిని చేస్తుందని అన్నాడు. మహేశ్​ వల్లే నేను, నా ఫ్రెండ్(విజయశాంతి) మళ్లీ కలిశాం" -మెగాస్టార్ చిరంజీవి

చివరగా మాట్లాడుతూ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పెద్ద హిట్టవుతుందని తన నమ్మకమని చిరంజీవి చెప్పాడు. సక్సెస్​ అనేది ఈ చిత్రానికి తథ్యమన్నాడు.

Special Advisory
Sunday 5th January 2020.
Please be advised of the following addition to today's stories:
NFL: New England Patriots - New England Patriots quarterback Tom Brady told media he is "pretty unlikely" to retire, after the defending Super Bowl champions were beaten 20-13 by the Tennessee Titans and knocked out of the NFL play-offs on Saturday.
Last Updated : Jan 6, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.