తెలంగాణ

telangana

'అర్జున్ సురవరం' కోసం మెగాస్టార్ చిరంజీవి

By

Published : Nov 23, 2019, 2:53 PM IST

త్వరలో జరిగే 'అర్జున్ సురవరం' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

మెగాస్టార్ చిరంజీవి

చిన్న సినిమాలకు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో చిత్రం చేరింది. అదే నిఖిల్​ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం'.ఇటీవలే ట్రైలర్​​ విడుదలైంది. త్వరలో ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరగనుంది. హీరో చిరంజీవి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

జర్నలిజం, విద్యావ్యవస్థ తదితర అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్​గా నటించింది. సామ్ సీఎస్ సంగీతమందించాడు. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: జార్జ్​రెడ్డి గురించి అప్పుడే విన్నా: మెగాస్టార్​ చిరంజీవి

ABOUT THE AUTHOR

...view details