బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను నెట్టింట అభిమానులతో పంచుకుంది నటి ప్రీతి జింతా. నేడు హాలోవీన్ సందర్భంగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు ఈ ఇద్దరు స్టార్లు. ఫొటోలు పోస్ట్ చేయగానే.. నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా 'దబాంగ్ 3'లో ప్రీతి ఓ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఇదే జరిగితే ఈ జోడీ 13 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేసినట్లు అవుతుంది.
ప్రీతి పెట్టిన పోస్టులో 'దబాంగ్ 3' షూటింగ్ అని పెట్టడం దీనికి కారణం. ఈ ఫొటోల్లో సల్మాన్ ఖాకీ దుస్తుల్లో ఉండగా.. ప్రీతి నీలం రంగు పోలీసు దుస్తుల్లో కనిపించింది. ఈ ఇద్దరూ కలిసి గతంలో 'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'జాన్ ఈ మాన్', 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' సినిమాల్లో నటించారు.