ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాధారంగా 'ఏక్ ఔర్ నరేన్' పేరుతో మరో బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి మిలాన్ భోమిక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు.
"ఈ చిత్రంలో రెండు అంశాలను చూపిస్తాం. దేశంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు స్వామి వివేకానంద ఏ విధంగా కృషి చేశారు, దేశకీర్తిని అత్యున్నత స్థాయికి మోదీ ఎలా తీసుకెళ్లారు అనే వాటిని ఇందులో చూపిస్తాం. వీరిద్దరూ తమ భావజాలంతో ప్రజలకు సేవ చేస్తూ దేశ కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత శిఖరానికి చేర్చారు."
-మిలాన్ భోమిక్, దర్శకుడు.