నితిన్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈసినిమా షూటింగ్ ఫిబ్రవరి 1న పూర్తయ్యింది. దీనిపై నితిన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'భీష్మ' చిత్రీకరణ ఓ ఎమోషనల్ జర్నీ అని అన్నాడు. అయితే నేడు ఈ సినిమా నుంచి రెండో పాటను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. 'వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ' అంటూ సాగే ఈపాట ప్రొమోను ఇటీవల విడుదల చేయగా.. నేడు పూర్తి లిరికల్ పాటను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.
లిరికల్: భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్ రిలీజ్ - రష్మికా మదన్
హీరో నితిన్ నటించిన కొత్త చిత్రం 'భీష్మ' నుంచి మరో పాటను ఆదివారం విడుదలైంది. 'వాటే బ్యూటీ' లిరికల్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం.
లిరికల్: భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్ రిలీజ్
ఈ పాట ప్రొమోను చూసిన సినీ ప్రియులు నితిన్, రష్మిక డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. డ్యాన్స్ చాలా బాగుందంటూ కామెంట్లు కూడా చేశారు. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి...నితిన్‌కు ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం
Last Updated : Feb 28, 2020, 10:20 PM IST