Amrita Rao Wedding: సూపర్ స్టార్ మహేశ్ బాబు 'అతిథి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి అమృతా రావ్.. మళ్లీ పెళ్లిచేసుకుంది. అవును.. ఈ మేరకు అమృత తన పెళ్లి ఫొటోలను తొలిసారిగా షేర్ చేసింది. కాకపోతే అమృత వివాహమాడింది వేరెవరినో కాదండోయ్.. తన భర్తనే.
అమృతరావు, అన్మోల్ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. ఈ జంట 'కపుల్ ఆఫ్ థింగ్స్' పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్లోనే ఆమె ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు.