తెలంగాణ

telangana

అమితాబ్..​ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు: రజనీకాంత్

By

Published : Dec 17, 2019, 9:20 AM IST

Updated : Dec 17, 2019, 11:53 AM IST

రాజకీయల్లోకి వెళ్లొద్దని అమితాబ్​ బచ్చన్​ సలహా ఇచ్చారని తెలిపాడు సూపర్​స్టార్​ రజనీకాంత్. రజని హీరోగా వస్తున్న 'దర్బార్'​ ట్రైలర్​ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సూపర్​స్టార్​ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Amitabh Bachchan asked me not to enter politics: Rajinikanth
'రాజకీయాల్లోకి వెల్లొద్దని అమితాబ్​ సలహా ఇచ్చారు'

ప్రముఖ నటుడు సూపర్​స్టార్ రజనీకాంత్​ హీరోగా ఏఆర్​ మురదాస్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దర్బార్'​. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదల కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తన రాజకీయం ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు రజనీ.

బాలీవుడ్​ దిగ్గజం అమితాబ్​ బచ్చన్​ తనను రాజకీయాల్లోకి వెళ్లొద్దని సూచించినట్లు రజనీ చెప్పాడు.

ఆన్​ స్క్రీన్​, ఆఫ్​ స్క్రీన్​ ఏదైనా అమితాబ్​ బచ్చనే నాకు ఆదర్శం. రోజూ తన జీవితంలో చేసే మూడు విషయాల గురించి నాకు చెప్పారు. ఒకటి రోజు వ్యాయామం చేయమన్నారు.. రెండోదిఎవరి మాటలు పట్టించుకోకుండానచ్చిందే చేయమని చెప్పారు. ఇక మూడోది రాజకీయాలలోకి వెళ్లొద్దు అని సూచించారు.

-రజనీ కాంత్​, సినీ నటుడు

పైన చెప్పిన రెండూ తాను తప్పకుండా పాటిస్తానని, కానీ మూడో సలహాను కొన్ని కారణాల వల్ల అమలు చేయలేనని రజనీ తెలిపాడు.

దర్బార్​ చిత్రంలో రజనీ సరసన నయనతార నటిస్తోంది. సూపర్​స్టార్​ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Dec 17, 2019, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details