హీరో అల్లు అర్జున్.. ఏ మాత్రం ఖాళీ దొరికిన తన పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే కూతురు అర్హకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి వైరల్గా మారింది.
ఇందులో ఏముందంటే?
'అల వైకుంఠపురములో' సినిమాలోని రాములో రాముల పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బన్నీ వేసిన 'హాఫ్ కోట్' స్టెప్పు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ పాటకు డ్యాన్స్ చేసింది అతడి కూతురు అర్హ. అయితే ఈ గీతంలో అల్లు అర్జున్ వేసిన ఓ స్టెప్పును 'దోశ స్టెప్పు' అని చెబుతోందీ చిన్నారి. బన్నీ అడిగిన ప్రశ్నలకు ముద్దు ముద్దుగా సమాధానమిచ్చింది.
ఈ సినిమాలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే. సుశాంత్, నవదీప్, టబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.
ఇది చదవండి: ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?