'సామజవరగమన' పాట... అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా గత కొంత కాలంగా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పదానికి అర్థం తెలియకపోయినా.. పాడుకోవడానికి క్లాసీగా, బోలెడంత క్యాచీగా ఉండటం వల్ల ఈ గీతాన్ని తెగ పాడేస్తున్నారు. అయితే సామజవరగమన అంటే అర్ధం ఏంటో తెలుసా?
'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది. ఏనుగు వంటి గంభీరమైన నడక గలవాడా అంటూ శ్రీకృష్ణుణ్ని కీర్తించే కీర్తన అది. ప్రముఖ రచయిత వేటూరి.. తనదైన శైలిలో ఈ పదాన్ని, వేరే పదాలతో మిక్స్ చేసి.. కె.విశ్వనాథ్ 'శంకరాభరణం' కోసం తొలిసారిగా ఉపయోగించారు.
అలాంటి అందమైన 'సామజవరగమన' పదాన్ని ఆ తర్వాత ఇంకో రెండు పాటల్లోనూ వినియోగించారు. వంశీ దర్శకత్వం వహించిన 'లాయర్ సుహాసిని', బాలకృష్ణ 'టాప్ హీరో' సినిమాల కోసం ఆ పదాన్ని ఉపయోగించారు. అవి ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఈ పదాన్ని నాలుగోసారి రాయడం వల్ల మరోసారి ట్రెండింగ్లో నిలిచింది. అదండీ 'సామజవరగమన' పదం వెనక ఉన్న కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">