అధికారం ఎంత పనైనా చేస్తుంది. నిజాయతీపరుడిని అవినీతి నేతగా మార్చేస్తుంది. నీతులు చెప్పినవారి చేతనే నేరాలు చేయిస్తుంది. ఈ కథాంశంతోనే 'ఆల్ ద కింగ్స్ మెన్' చిత్రం రూపొందించారు. అమెరికా రచయిత రాబర్ట్ పెన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. 1949లో విడుదలైంది. మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రం వచ్చి నేటితో 70 ఏళ్లు పూర్తయ్యాయి.
నీతి నిజాయతీలను నెలకొల్పాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి.. అధికార చదరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కరడు కట్టిన అవినీతి నేతగా ఎందుకు మారాడనేదే సినిమా కథాంశం.