'పదేళ్లకే నాకు పెళ్లి చేశారు. దాంతో నా తోటి వాళ్లంతా నన్ను ఏడిపించేవారు' అని గతాన్ని గుర్తు చేసుకున్నారు అలనాటి నటి కృష్ణవేణి. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి డబ్బింగ్ జానకితో కలిసి విచ్చేశారామె. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
ఈ షోలో బాల్యంలో తను చేసిన సాహసాలు, నట ప్రయాణం, బాల్య వివాహం తదితర విషయాలు పంచుకున్నారు కృష్ణవేణి. 'నన్ను దాసరి జానకి అంటే గుర్తుపట్టరు. డబ్బింగ్ జానకి అనాలి. అయినా డబ్బింగ్ శర్మగారని ఎందుకు అనరు? డబ్బింగ్ జగ్గయ్యగారని ఎందుకు అనరు? నన్ను మాత్రమే ఎందుకు డబ్బింగ్ జానకి అంటారని చాలాసార్లు పోట్లాడాను' అని ప్రశ్నించారు నటి జానకి.