టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల పెళ్లిపై స్పందించాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. శాశ్వతంగా లాక్డౌన్ అవడానికి ఇదే సిసలైన మార్గం అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు.
పెళ్లికి ముందు రానాకు అక్షయ్ ఏం చెప్పాడంటే..!
దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. ఈ రోజు రాత్రి యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్.
పెళ్లికి ముందు రానాకు అక్షయ్ ఏం చెప్పారంటే..!
"రానా దగ్గుబాటి... శుభాకాంక్షలు. మీ జంట జీవితకాలం ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అని అక్షయ్ పేర్కొన్నాడు.
ఇప్పటికే రానా-మిహీక పెళ్లి వేడుకకు రామానాయుడు స్టూడియో అందంగా ముస్తాబు అయింది. ఆగస్టు 8న(ఈరోజు) రాత్రి 8.30 గంటలకి రానా దగ్గుబాటి తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు.