తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క చిత్రానికి రూ.120 కోట్ల పారితోషికమా..!

భారతీయ సినీతారల్లో సంపాదనలో అగ్రస్థానంలో ఉన్న అక్షయ్​కుమార్.. తన తర్వాతి చిత్రానికి భారీ పారితోషికం తీసుకోనున్నాడట. ఆనంద్​ ఎల్​.రాయ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాణ బాధ్యతలను స్వీకరించనున్నాడని సమాచారం.

Akshay Kumar to charge Rs 120 crore for Aanand L Rai's next
ఒక్క చిత్రానికి రూ.120 కోట్ల పారితోషికమా!!

By

Published : Jan 24, 2020, 7:00 AM IST

Updated : Feb 18, 2020, 4:58 AM IST

ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యధిక ఆదాయం సంపాదిస్తోన్న సినీతారల్లో యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌ అగ్ర స్థానంలో ఉంటాడు. గతేడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో సంవత్సరానికి దాదాపు రూ.450 కోట్లు సంపాదిస్తున్నట్టు తేలింది. నిజానికి బాలీవుడ్‌లో ఆయన పారితోషికం ఖాన్‌ల త్రయంతో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు. కానీ, వాళ్లు ఏడాదికి ఒక్క చిత్రంతో నెట్టుకొస్తుంటే.. అక్షయ్‌ మాత్రం సంవత్సరానికి నాలుగు చిత్రాలకు తక్కువ కాకుండా చేస్తున్నాడు. దీనికి తోడు ఇటీవల కాలంలో అక్షయ్​ చిత్రాల సక్సెస్‌ రేటు కూడా బాగా ఉండటం వల్ల ఆయన ఆదాయం ఎక్కువగా ఉంది.

మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా మరింత సంపదను ఆర్జిస్తున్నాడు. ఇప్పుడీ హీరో ఖాతాలో పారితోషికం పరంగానూ ఓ అరుదైన రికార్డు చేరబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలో ఆనంద్‌ ఎల్‌.రాయ్‌తో ఆయన చేయబోయే కొత్త చిత్రం కోసం దాదాపు రూ.120 కోట్ల పారితోషికం అందుకోనున్నాడట.

ఈ చిత్రంలో అక్షయ్‌తో పాటు ధనుష్, సారా అలీఖాన్‌లు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ సినిమా కోసం అక్షయ్‌కు ఇంత భారీ రెమ్యూనరేషన్​ను అందిచనుంది చిత్ర బృందం. అయితే ఇదంతా ఒకే మొత్తంలో ఉండదని, కొంత పారితోషికంగా ఇవ్వనుండగా.. మిగిలినది డిజిటల్, శాటిలైట్‌ రైట్స్‌ రూపంలోనూ, లాభాల్లో వాటా కింద ఇవ్వబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో అక్షయ్‌ నుంచి వచ్చిన ప్రతి చిత్రం దాదాపు రూ.200 కోట్ల మార్కును దాటిన నేపథ్యంలో ఈ లాభాల్లో వాటా వల్ల ఆయన పారితోషికం రూ.120 కోట్ల కన్నా ఎక్కువే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఒక్క చిత్రం కోసం ఆయన అందుకోబోతున్న పారితోషికం ఇప్పుడు ఉత్తరాదిలోనే కాక దక్షిణాదిలోనూ చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చూడండి.. 'రాక్షస రాజ్యంలో రావణాసురుడి'గా రానా!

Last Updated : Feb 18, 2020, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details