తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చీపురు పట్టిన కత్రినా.. అక్షయ్​పై ఫ్యాన్స్ ఆగ్రహం - సూర్యవంశి

సాధారణంగా కథానాయికలు ఎవరైనా అందంగా కనిపించడానికే ప్రాధాన్యమిస్తారు. అభిమానులతో పంచుకునే ఫొటోలైతే ఇంకా బాగుండాలని భావిస్తారు. దీనికి భిన్నంగా కత్రినా కైఫ్​ మాత్రం నెట్టింట్లో కొత్తగా కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Akshay Kumar shares Katrina's funny BTS video from sets of Sooryavanshi
ఎంత పని చేశావ్​.. కత్రీనా..!

By

Published : Feb 4, 2020, 5:26 PM IST

Updated : Feb 29, 2020, 4:06 AM IST

కథానాయికలు ఎవరైనా అందంగా తయారై ప్రేక్షకులను కవ్వించడం మామూలే. కానీ బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ మాత్రం చీపురు పట్టి గదిని శుభ్రం చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఉందా. అయితే చదివేయండి.

అక్షయ్‌ కుమార్‌,కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ​తెరకెక్కుతోన్న చిత్రం 'సూర్యవంశీ'. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది .తాజాగా చిత్ర సెట్లో కత్రినా కైఫ్‌ చీపురు చేత పట్టి గదిని శుభ్రం చేస్తున్న వీడియో తీశారు. ఆ వీడియోను నటుడు అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఆ వీడియోకు.."స్వచ్ఛ భారత్‌కు కొత్త బ్రాండ్‌ అంబాసిడర్​" అంటూ కత్రినాను ఉద్దేశించి సందేశం జోడించాడు. దీనిపై ఈ ముద్దుగుమ్మ అభిమానులు అక్షయ్‌పై గుర్రుగా ఉన్నారట. కత్రినా అంటే ప్రేక్షకులకు గ్లామరస్‌గా కనపడాలి కానీ, ఇలాంటి స్వచ్ఛ భారత్‌ వీడియోలు ఏంటని ఫ్యాన్స్ కొంతమంది ఫీలవుతున్నారు.

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్, రణ్​వీర్ సింగ్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ పోలీస్‌ అధికారి డీసీపీ వీర్‌ సూర్యవంశీగా నటిస్తున్నాడు. మార్చి 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: పవర్​స్టార్​ కొత్త సినిమాలో రంగమ్మత్తకు ఛాన్స్..!​

Last Updated : Feb 29, 2020, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details