'ఆర్‌ఎక్స్ 100'.. పేరుకే చిన్న సినిమా అయినా, టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లను రాత్రికి రాత్రే స్టార్లను చేసింది. వాస్తవ సంఘటనలతో, పూర్తిస్థాయి ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. త్వరలో దీనికి సీక్వెల్ రాబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడే ధ్రువీకరించారు.
'ఆర్‌ఎక్స్ 100'కు సీక్వెల్.. ఈసారి ఎలా ఉండనుందో? - కార్తికేయ హీరోగా తెరకెక్కిన 'ఆర్‌ఎక్స్ 100
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నటించిన 'ఆర్‌ఎక్స్ 100'కు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు చెప్పారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో వెల్లడించారు.

త్వరలో 'ఆర్‌ఎక్స్ 100' సీక్వెల్
లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన డైరెక్టర్ అజయ్ భూపతి.. కథానాయకుడు కార్తికేయ, అభిమానులతో ఇన్‌స్టా వేదికగా ముచ్చటించారు. ఈ క్రమంలో 'ఆర్‌ఎక్స్ 100'కు సీక్వెల్ వస్తుందా? అని ఓ నెటిజన్ అజయ్‌ను అడగ్గా.. ఉంటుందని బదులిచ్చారు. ప్రస్తుతం చేస్తున్న 'మహాసముద్రం' పూర్తయిన తర్వాతే.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈసారి ఎలాంటి సెన్సేషనల్ కథతో వస్తారోనని అభిమానులు అప్పుడే చర్చించుకుంటున్నారు.
ఇదీ చూడండి : లాక్‌డౌన్ విరామాన్ని 'రకుల్' ఎలా అస్వాదిస్తుందంటే?