Hamsa Nandini: 'మిర్చి', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగువారికి చేరువైన నటి హంస నందిని. ఇటీవల ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. కొంతకాలంగా సోషల్‌మీడియా, సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోమవారం ఉదయం ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ఆమె అన్నారు.
అయ్యో హంస నందిని.. ఈ పెద్ద రోగం నీకు తగిలిందా! - hamsa nandini photo
Hamsa Nandini Cancer: ప్రముఖ సినీనటి హంస నందిని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తాను రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.
"కాలం నా జీవితంలో ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో జీవించను. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నా. 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో నా తల్లి కన్నుమూశారు. నాటి నుంచి నేను అదే భయంతో జీవిస్తున్నా. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. పరీక్షల అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్ గ్రేడ్-3 దశలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నాను. మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మీ ముందుకువస్తా. అందరిలో ప్రేరణనింపడానికే నా కథ చెబుతున్నా" అని హంస నందిని తెలిపారు.
ఇదీ చూడండి:నొప్పి భరిస్తూనే ఈ స్టార్స్ నటిస్తున్నారు..!