తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Actress died: సీనియర్ నటి కన్నుమూత

దాదాపు 58 ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న నటి ఫరూఖ్ జాఫర్(farrukh jaffar death) మరణించింది. ఆమెకు సంతాపం తెలుపుతూ పలువురు నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

farrukh jaffar death
ఫరూఖ్ జాఫర్

By

Published : Oct 16, 2021, 6:44 AM IST

సీనియర్ నటి ఫరూఖ్ జాఫర్(88)​ మృతి చెందింది. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె(farrukh jaffar death).. శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది.

1963లో వివిధ్ భారతి సినిమాతో కెరీర్​ ప్రారంభించిన ఫరూఖ్(farrukh jaffar movies).. 1981లో వచ్చిన ఉమ్రో జాన్ సినిమాతో సహాయ నటిగా మారింది. ఆ తర్వాత స్వేడ్స్, పెప్లీ లైవ్, బేర్​ఫూట్ టూ గోవా, అలీఘడ్, సుల్తాన్, సీక్రెట్​ సూపర్​స్టార్, వాట్ విల్ పీపుల్ సే, ఫొటోగ్రాఫ్, అమ్మా కీ బోలీ, గులాబో సితాబో(gulabo sitabo review) తదితర చిత్రాల్లో నటించింది.

నటి ఫరూఖ్ జాఫర్

చివరగా 'గులాబో సితాబో'లో అమితాబ్​ బచ్చన్​కు భార్యగా నటించిన ఫరూఖ్(farrukh jaffar news).. 88 ఏళ్ల వయసులో ఫిల్మ్​ఫేర్ అవార్డు(filmfare awards 2021) సొంతం చేసుకుంది. ఎక్కువ వయసులో ఈ అవార్డు అందుకున్న యాక్టర్​గా రికార్డు సృష్టించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details