తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2020, 7:25 PM IST

ETV Bharat / sitara

అభిషేక్ 'బ్రీత్ 2' సిరీస్​ విడుదల తేదీ ఖరారు

సైకలాజికల్ థ్రిల్లర్​గా రూపొందిన వెబ్ సిరీస్ 'బ్రీత్'​ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్​కు రెండో భాగం తెరకెక్కింది. అభిషేక్ బచ్చన్​ ఇందులో కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ సిరీస్​ను జులై 10న విడుదల చేస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Abhishek Bachchan's digital debut, 'Breathe: Into The Shadows' to release on July 10
బ్రీత్

అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్, సయామీ కేర్ వంటి తారాగణంతో తెరకెక్కిన వెబ్​ సిరీస్ 'బ్రీత్: ఇన్​టు ద షాడోస్'. మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​ను జులై 10న అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 2018లో విడుదలైన 'బ్రీత్' మొదటి భాగం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

సైకలాజికల్ థ్రిల్లర్​గా తెరకెక్కిన 'బ్రీత్'​ మొదటి సీజన్​లో హీరో మాధవన్ కీలకపాత్ర పోషించారు. రెండో భాగంలో అభిషేక్​ కనిపించనున్నారు. సీట్ ఎడ్జ్​ థ్రిల్లర్​గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్​ రెండో భాగం కోసం ఇప్పటికే ప్రైమ్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details