అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం 'ఏబీసీడీ'.. 'అమెరికన్ బోర్న్ కన్ప్యూుజ్డు దేశీ' అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
'నేను రిచ్గానే పుట్టా.. రిచ్గానే ఉంటా'
అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'ఏబీసీడీ'.. ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
ఏబీసీడీ
ట్రైలర్ చూస్తుంటే కామెడీకి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. "ఓడిపోయి కూడా ఎలా గెలవాలో తెలుసుండాలి... అదే రాజకీయం", "నువు పెద్ద స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకే.. కష్టాల్లోకి తోసేస్తే మారడానికి" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేనా ఉన్నాయి. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ వచ్చేసింది