తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఏబీసీడీ' సెన్సార్ పూర్తి.. 17న విడుద‌ల‌ - allu sirish

అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ ప్రధానపాత్రల్లో రూపొందిన చిత్రం ఏబీసీడీ. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే17న విడుదలకు సిద్ధమయింది.

అల్లు శిరీశ్

By

Published : May 11, 2019, 9:34 AM IST

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఏబీసీడీ'. సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై తెరకెక్కుతోంది. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ దక్కించుకుంది. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది.

ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పందన లభించింది. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన 'మెల్ల‌మెల్ల‌గా' పాట అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ 25 మిలియ‌న్ వ్యూస్‌ను రాబ‌ట్ట‌ుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అమెరికా నుంచి ఇండియా వ‌చ్చిన ఎన్​ఆర్​ఐ పాత్ర‌లో అల్లు శిరీశ్, అత‌ని స్నేహితుడిగా భ‌ర‌త్ కనిపించనున్నారు.

ఇవీ చూడండి.. పవన్​ భుజాలెక్కిన వరుణ్​​....!

ABOUT THE AUTHOR

...view details