తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన '96' చిత్రం గతేడాది ఘనవిజయం అందుకుంది. తెలుగులో రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.
'96' తెలుగు రీమేక్ టైటిల్, ఫస్ట్‌లుక్ ఇదిగో - 96 తెలుగు రీమేక్
తమిళంలో ఘన విజయం సాధించిన '96' తెలుగు రీమేక్‌లో సమంత, శర్వానంద్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
సమంత
సినిమాలో హీరోయిన్ పాత్ర పేరైన 'జాను'ను టైటిల్‌గా ఖరారు చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన సమంత లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇవీ చూడండి.. ఇప్పటికీ ఆమె మాటే శాసనం: కృష్ణవంశీ
Last Updated : Jan 7, 2020, 11:18 AM IST