WhatsApp New Features :ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్.. ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. తాజాగా వాట్సాప్ బిజినెస్ ఖాతాదారుల కోసం అదిరిపోయే ఫీచర్లను తీసుకువచ్చింది. అవి.. వాట్సాప్ ఫ్లోస్, పేమెంట్స్, మెటా వెరిఫైడ్ ఫీచర్స్. ఈ ఫీచర్లు కేవలం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమేనని అందుబాటులో ఉంటాయి. అయితే వీటితోపాటు త్వరలో ముఖ గుర్తింపు (పాస్కీ) ఫీచర్‌ను కూడా తీసుకువచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
వాట్సాప్ ఫ్లోస్ ఫీచర్..
WhatsApp Flow Feature :ఈ ఫ్లోస్ ఫీచర్ ద్వారా వాట్సాప్‌లోనే ఉంటూ వివిధ రకాల వ్యాపార సేవలను వినియోగదారులు పొందవచ్చు. వాట్సాప్‌ను వీడకుండా.. చాట్‌లో ఉంటూనే ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పుడ్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సినిమా టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇవేకాకుండా ఈ ఫీచర్ ద్వారా మరిన్ని సేవలను వినియోగదారులు పొందవచ్చు.
వాట్సాప్ పేమెంట్ ఫీచర్..
WhatsApp Payment Feature : యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌లోనే షాపింగ్ చేయవచ్చు. దాంతోపాటు చెల్లింపులు కూడా వాట్సాప్‌లోనే జరపవచ్చు. ముఖ్యంగా యూపీఐ, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా వాట్సాప్‌లో చెల్లింపులు చేయవచ్చు. అంటే చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది ఈ ఫీచర్.
వాట్సాప్ మెటా వెరిఫైడ్ ఫీచర్..
WhatsApp Metra Verified :మెటా కంపెనీ.. వాట్సాప్‌లో కూడా వెరిఫైడ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం తరహాలోనే వాట్సాప్ బిజినెస్ వినియోగదారులకు కూడా బ్లూక్ టిక్ ఇవ్వనుంది. వాట్సాప్ నిబంధనలకు అనుగుణంగా యూజర్‌ను వెరిఫై చేసి బ్లూ టిక్ అందించనుంది.
వాట్సాప్ ముఖ గుర్తింపు ఫీచర్..
WhatsApp Face Recognition Feature :వాట్సాప్ త్వరలో పాస్కీ ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా వాట్సాప్ ఖాతాలకు మరింత భద్రత చేకూరనుంది. ఎలా అంటే.. యూజర్లు ఫేస్ రికగ్నిషన్ లేదా ఐరిష్ గుర్తింపు ద్వారా వాట్సాప్ అకౌంట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. దీని వల్ల ఇతరులు ఎవ్వరూ.. యూజర్ అకౌంట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి వీలులేకుండా పోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కానీ బీటా వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.