తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2022, 11:21 AM IST

Updated : Sep 4, 2022, 6:27 PM IST

ETV Bharat / science-and-technology

వాట్సాప్ అడ్మిన్లకు ఆ అధికారాలు.. నకిలీ వార్తలు, తప్పుడు సందేశాల ఆట కట్టు!

Whatsapp admin rights : వాట్సాప్‌ గ్రూపు అడ్మిన్‌లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌ గ్రూపులపై అడ్మిన్‌లు మరింత పట్టు సాధించనున్నారు. గతంలో వాట్సాప్‌ గ్రూపులో సభ్యులు ఏదైనా మెసేజ్‌ పోస్ట్‌ లేదా షేర్ చేసినా దాన్ని డిలీట్ చేసే ఆప్షన్‌ కేవలం సదరు యూజర్‌కు మాత్రమే ఉండేది. ఈ అప్‌డేట్‌తో గ్రూపు సభ్యులు పోస్ట్‌ లేదా షేర్‌ చేసిన అభ్యంతరకర మెసేజ్‌లను అడ్మిన్లు తొలగించవచ్చు.

Whatsapp admin rights
Whatsapp admin rights

Whatsapp admin rights : గ్రూపులలో అభ్యంతరకర సందేశాలు, నకిలీ వార్తల కట్టడికి సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్‌ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గ్రూప్‌లోని సభ్యుల సందేశాలను తొలగించే ఆప్షన్‌ను అడ్మిన్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇంతవరకు వాట్సాప్‌ గ్రూప్‌లో ఎవరైనా సభ్యుడు అభ్యంతరకర సందేశాన్ని పోస్టు లేదా షేర్‌ చేస్తే... దాన్ని అతను తప్ప గ్రూప్‌ అడ్మిన్‌ తొలగించటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గ్రూప్‌లోని సభ్యుడెవరైనా అభ్యంతరకర సందేశాన్ని పోస్టు చేసినా లేదా షేరింగ్‌ చేసినా దాన్ని గ్రూప్‌ నుంచి అడ్మిన్‌ తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌.... త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.

ఇలా పనిచేస్తుంది
గ్రూపు సభ్యులు పోస్ట్‌ లేదా షేర్ చేసిన మెసేజ్‌ను అడ్మిన్‌ సెలెక్ట్‌ చేస్తే చాట్ పేజీపైన డిలీట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిలీట్‌ ఫర్ ఎవ్రీవన్‌, డిలీట్‌ ఫర్‌ మీ, క్యాన్సిల్‌ అని 3ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ సెలెక్ట్ చేస్తే సదరు మెసేజ్‌ గ్రూపు నుంచి డిలీటవుతుంది. సదరు మెసేజ్‌ అడ్మిన్‌ తొలగించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల గ్రూపులో అభ్యంతరకరమైన మెసేజ్‌లతోపాటు, నకిలీ వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని వాట్సాప్‌ చెబుతోంది.

ఇదేకాకుండా కొత్త ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. గ్రూపులో సభ్యులుగా కొనసాగడం ఇష్టంలేనివారు ఇతరులకు తెలియకుండా గ్రూపు నుంచి లెఫ్ట్‌ కావచ్చు. ఆ విషయం అడ్మిన్లకు మాత్రమే తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో చాట్ చేస్తున్నప్పుడు వేరొకరి నుంచి వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం ఇష్టం లేకపోతే, మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు తెలియకుండా స్టేటస్‌ను హైడ్ చేసుకోవచ్చు. వ్యూవన్‌ ఫీచర్‌ ద్వారా పంపే ఫొటో ఫైల్‌ను స్క్రీన్‌ తీసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ తొలగించింది. డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌ గడువు పరిమితిని కూడా రెండురోజుల 12 గంటలకు పొడిగించింది.

ఆధునిక కాలంలో వాట్సాప్​ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సపోర్ట్​ చేసే ఫ్రీ మెసేజింగ్​ యాప్​. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్​ వచ్చినప్పటికీ దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. టిప్స్​ను ఉపయోగించడం ద్వారా వాట్సాప్​ను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు. గ్రూప్​లో సీక్రెట్​గా మెసేజ్​లను చదవడం, షార్ట్​కట్​లు పెట్టుకోవడం, స్టోరేజ్ మేనేజ్​మెంట్ వంటి వాటిపై ట్రిక్స్ తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇదీ చదవండి:

Last Updated : Sep 4, 2022, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details