Flipkart Offers on Iphone 12 :ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఫ్లిప్‌కార్ట్ ఈ దీపావళి పండుగ సీజన్లో ఐఫోన్ 12, ఐఫోన్ 14 ఫోన్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
IPhone 12 Offers :ప్రస్తతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.79,900 ఉండేది. కానీ దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,150 భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.4,849కే సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్
IPhone 12 Discounts On Flipkart :ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 సీరిస్ ధర రూ.43,999గా ఉంది. మీరు కనుక మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.39,150 వరకు ఆదా అవుతుంది. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా ఉపయోగిస్తే.. ఐఫోన్ 12ను మీరు కేవలం రూ.4,849కే కొనుగోలు చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వీటన్నింటిని ఉపయోగించి ఐఫోన్ 12ను సొంతం చేసుకోండి.
ఐఫోన్ 12 ఫీచర్లు ఇవే!
IPhone 12 Features :
- సిరామిక్ షీల్డ్, IP 68 వాటర్ రెసిస్టెన్స్
- 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED
- 12 ఎమ్పీ డ్యుయెల్ కెమెరా
- 12 ఎమ్పీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా విత్ నైట్ మోడ్
- 4కె డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్
- 64జీబీ స్టోరేజ్
ఇదే చివరి అవకాశం!
యాపిల్ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 12 ఒకటి. ఈ ఐఫోన్ 12 మార్కెట్లోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయ్యింది. ఇది మిగిలిన ఫోన్లతో పోలిస్తే సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత.. ఐఫోన్ 12ను యాపిల్ స్టోర్‌లో అమ్మడంలేదు. మరికొద్ది రోజుల్లో ఈ కామర్స్ సైట్లలో కూడా అమ్మకం నిలిపివేసే అవకాశం ఉంది.
Flipkart Offers On IPhone 14 :
ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌ను కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇటీవల ఫ్లిప్‌కార్ట్ నిర్విహించిన బిగ్ బిలియన్‌డేస్ సేల్‌లో ఐఫోన్ 14ను మీరు మిస్ అయ్యుంటే ఇది మీ కోసమే!