తెలంగాణ

telangana

ETV Bharat / priya

రవ్వ పులిహోర కలిపేయండిలా! - etv bharat food

పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. చుట్టాలొచ్చినా.. అన్నం మిగిలిపోయినా... మన తెలుగింట పులిహోర ఫలహారం సిద్ధమవుతుంది. అయితే, అన్నంతో చేసిన పులిహోర తిని బోర్ కొట్టేసిందా? మరి, ఈ సారి రవ్వతో పులిహోర కలిపేద్దాం రండి.

By

Published : Aug 27, 2020, 1:00 PM IST

Updated : Aug 27, 2020, 3:04 PM IST

ఎంతో రుచిగా ఉండే రవ్వ పులిహోర మామిడి తురుముతో చేసుకుంటే అదిరిపోద్ది. అయితే, మామిడి అందుబాటులో లేనప్పుడు నిమ్మకాయతోనూ చేసుకోవచ్చు.

కావాల్సినవి

బియ్యపురవ్వ - మూడు కప్పులు, నీళ్లు - అయిదు కప్పులు, మామిడితురుము - ముప్పావుకప్పు, పచ్చిమిర్చి - అయిదు, మెంతులు - పావు చెంచా, కరివేపాకు - రెండు రెబ్బలు, సెనగపప్పు - రెండు చెంచాలు, మినప్పప్పు - రెండు చెంచాలు, పల్లీలు - అరగుప్పెడు, బెల్లం - చిన్న ముక్క, ఎండుమిర్చి - రెండు, జీలకర్ర - చెంచా, ఆవాలు - చెంచా, పసుపు - చిటికెడు, నూనె - పావు కప్పు.

తయారీ

పొయ్యి మీద బాణలి పెట్టి అయిదు చెంచాల నూనె వేయాలి. అది వేడయ్యాక ఆవాలూ, జీలకర్రా, మినప్పప్పూ, పల్లీలూ, సెనగపప్పు వేసి వేయించాలి. ఇవి చిటపటమన్నాక మెంతులను వేయాలి. ఇందులోనే పచ్చిమిర్చీ, కరివేపాకూ, ఎండుమిర్చీ కూడా వేసి మరికొంతసేపు వేయించాలి. ఇందులో మామిడి తురుమూ, బెల్లం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. మరో గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక నీళ్లు పోయాలి. పసుపు కూడా కలిపి మూత పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వను మెల్లిగా వేసుకుని మంట తగ్గించాలి. కాసేపటికి నీళ్లు ఆవిరై రవ్వ ఉడుకుతుంది. అప్పుడు దింపేయాలి. దీన్ని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. ఇది పొడిపొడిగా మారి, ఆరాక మామిడి తాలింపు కలిపితే చాలు.

ఇదీ చదవండి: 'మొఘలాయి రొయ్యల కూర' రుచి చూశారా?

Last Updated : Aug 27, 2020, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details