మన శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఫిట్‌గా (Fitness) ఉండటంలో ఆహారానిది ప్రధానపాత్ర. ఉదయం లేవగానే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? అని చాలామందికి ప్రశ్నగా మిగిలిపోతుంది. అనారోగ్యకరమైన ఆహారం తినడం, ఫాస్ట్ఫుడ్తో కడుపు నింపుకోవడం వల్ల మనిషి బరువు అసహజంగా పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బరువు ఎక్కువగా ఉండేవారు 13 రకాల క్యాన్సర్ల బారినపడే ముప్పు ఉందని ఇటీవలే ఓ అధ్యయనం తెలిపింది. పోషకాలు లేని ఆహారం, అర్ధరాత్రి వరకు తింటూ ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
మరి ఆరోగ్యకరంగా ఉండటానికి ఏం తినాలంటే (fitness food plan)..
- పాలల్లో ఒక బౌల్ హోల్ గ్రేన్ సెరియల్ వేసుకొని తింటే మంచింది. లేదా గోధుమలతో తయారు చేసిన టోస్ట్ తినాలి.
- అరటిపండు కూడా ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటే మంచిది. బీపీ ఉన్నవారు పొటాషియం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
- రోజుకు ఒక యాపిల్ లేదా అరటిపండు తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. వర్క్అవుట్స్ చేయడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల ముందు (best food to eat before workout) యాపిల్ గానీ అరటిపండు గానీ తీసుకోవాలి. సహజ సిద్ధంగా శక్తి సమకూరుతుంది. మీ శరీరం ఈ కార్బోహైడ్రేట్స్‌ను సులభంగానే జీర్ణం చేసుకోగలదు. వెంటనే శక్తి సమకూరి వ్యాయామం చేయవచ్చు. దీంతోపాటు వేరే ఏదైనా పండ్లు తీసుకోవాలి.
బ్యాలెన్స్డ్ డైట్ (balanced diet) ముఖ్యం..
అన్ని రకాల పోషక పదార్థాలు సమతూలికగా ఉండే ఆహారాన్ని సంపూర్ణ ఆహారం (బ్యాలెన్స్డ్ డైట్) అంటారు. ఇది ప్రతి వయసుకు మారుతూ ఉంటుంది. పోషక విలువలు అంతే ఉన్నప్పటికీ ఎంత మోతాదులో తీసుకోవాలి అనే దాంట్లో వ్యత్యాసం ఉంటుంది.
బ్యాలెన్స్డ్ డైట్ 3 రకాలు. ఒకటి శరీర పెరుగుదలకు, రెండోది శరీర ప్రక్రియను మెరుగుపరచడానికి, చివరగా శరీరానికి ఇంధనం ఇవ్వడానికి.